Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

తెలంగాణలో భారీ వర్షాలు : వాతావరణ శాఖ

వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసరాలలో ఉన్న ఆవర్తనం ఈ రోజు ఉత్తర ఒడిశాను ఆనుకుని, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని తెలిపింది. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.బుధవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img