Monday, May 6, 2024
Monday, May 6, 2024

వరద ముంపు ప్రాంతాలకు నగర పాలక సంస్థ సిబ్బంది

వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలైన కన్నయ్య గట్టు, తిరుమలపురం, కట్టుకూరు గ్రామాలకు శానిటేషన్, వరద సహాయక చర్య నిమిత్తం ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ షాహిద్ సారథ్యంలో 104 మంది తో కూడిన బృందం సోమవారం ప్రత్యేక బస్సులో తరలి వెళ్ళింది. ఈ బస్సును సోమవారం నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ బృందంలో 70 మంది పీహెచ్ వర్కర్లు 8 మంది యాంటీ మలేరియా వర్కర్లు 12 మంది గ్యాంగ్ వర్కర్లు, 6 వాటర్ టెస్టింగ్ టీం, 3 సానిటరీ ఇన్స్పెక్టర్లు, 1 సానిటరీ సూపర్వైజర్ తో గూడెం బృందంతోపాటుగా 500 కేజీల లైమ్, 250 కేజీల బ్లీచింగ్ పౌడర్, వాకింగ్ మిషన్లు, స్ప్రేయింగ్ క్యాన్లు, ఇతర శానిటేషన్ సామగ్రి తో సదరు ముంపు గ్రామాలకు సహాయక చర్యల నిమిత్తం వెళ్లారు.సదరు బృందంతో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ,మునిసిపల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ బయలుదేరి వెళ్ళారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img