Monday, May 6, 2024
Monday, May 6, 2024

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఐసిడిఎస్ పిఓ

మురిపాలతో వ్యాధి నిరోధక శక్తి…

పెనుమంట్ర:శిశువులకు తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమైన పోషకాహారం అని, బిడ్డకు
మొదటి వ్యాధి నిరోధక టీకాగా తల్లిపాలు పనిచేస్తాయని పెనుమంట్ర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని కె. మేరీ ఎలిజిబెత్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలపై శుక్రవారం పెనుమంట్ర గ్రామ ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా కె. మేరీ ఎలిజిబెత్ సోమవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు తల్లి
పాల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి తల్లి కాన్పు అయిన అరగంటలో మురిపాలు తాగించితే ఆ బిడ్డకు సహజ వ్యాధినిరోధక శక్తి వస్తుందన్నారు. బిడ్డలకు పాలు ఇచ్చే తల్లులకు రొమ్ము క్యాన్సర్ రాదని తెలిపారు. నెలలోపు శిశు మరణాలు జరగడానికి కారణమయ్యే శ్వాసకోశవ్యాధులు, కామెర్లు,
డయేరియా వంటి రోగాలను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి తల్లి పాలలోనే నవజాత శిశువుకు లభిస్తుందన్నారు. బాలింతలలో తల్లిపాల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాలని ఆరోగ్య, ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడి సహాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img