Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సంక్షేమ పథకాలను తాయిలాలు అనడం పేదలను అవమానించడమే..

కేంద్రం, బీజేపీ తీరు సరికాదన్న ఎమ్మెల్సీ కవిత
పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను ఉచితాలు, తాయిలాలు అంటూ కేంద్రం, బీజేపీ ప్రచారం చేయడం సరికాదని.. పేదలను అవమానించడమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు.దేశ జనాభాలో ఎక్కువ మంది పేదలేనని.. కేంద్రంగానీ, రాష్ట్రాలుగానీ ఏ ప్రభుత్వమైనా సరే వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తాయని అన్నారు. పేదలకు ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలను తాయిలాలు అంటున్న కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకులను దోచుకున్న కార్పొరేట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటని, దానిని ఏమనాలని కవిత ప్రశ్నించారు. పేదల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య కోసం, వ్యవసాయం కోసం అమలు చేస్తున్న పథకాలు తాయిలాలు కాదని స్పష్టం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ పేదలను అవమానించడం మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.పేదలకు ఉచిత విద్య, విద్యుత్‌, ఆరోగ్యం అందించే పథకాలకు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. వీలైతే రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాయం చేయడం ఇష్టం లేకపోతే ఊరుకోవాలేగానీ.. రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టడం సరికాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img