Monday, May 6, 2024
Monday, May 6, 2024

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శిగా మన్నవ కృష్ణ చైతన్య

సహాయ కార్యదర్శిగా ఉప్పులూరి హేమ శంకర్

ఏలూరు: సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి గా మన్నవ కృష్ణ చైతన్య , సహాయ కార్యదర్శిగా ఉప్పులూరి హేమ శంకర్ఎం పికయ్యారు. ఈ నెల 23,24 తేదీల్లో ఏలూరు నగరంలో జరిగిన జిల్లా ప్రథమ మహాసభలలో ఆయన సిపిఐ ఏలూరు జిల్లా ప్రధమ కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా ఉప్పులూరి హేమ శంకర్ ఎంపికైనట్లు రాష్ట్ర నాయకత్వం సభ్యుల హర్షద్వనుల మధ్య ప్రకటించారు.

జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతా…

జిల్లాలోని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిరంతర శ్రామికునిగా పనిచేస్తానని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. నూతనంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గా ఎన్నికైన కృష్ణ చైతన్య విశాలాంధ్ర తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలని,పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని,ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు గా నిర్వాసితులకు నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మహాసభల్లో చర్చించి పోరాటాలకు రూప కల్పన‌ చేయడం జరుగుతుందని ,చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకూ సిపిఐ నిర్వాసితులకు కొండంత అండగా ఉంటుందన్నారు.,గిరిజన ప్రాంతాల్లో పోడు భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ,అర్హులైన గిరిజనులకు పట్టలివ్వాలని డిమాండ్ చేశారు.చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం త్వరిత గతిన పూర్తి చేయాలని , సాగు భూములకు నీరందించాలని, రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చట్ట ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిపై ఈ నెల 26,27,28 తేదీల్లో విశాఖపట్నం లో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఏలూరు జిల్లా తరపున తీర్మానం చేస్తామని తెలిపారు. పార్టీ లోని సీనియర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ అందరినీ కలుపుకుని పార్టీ నిర్మాణం,విస్తరణపై దృష్టి సా రిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img