Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు వాడీ వేడిగా.. టీడీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. చర్చించాలంటూ పట్టుపట్టింది. స్పీకర్‌ పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు.. జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల వైఖరిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తప్పుబట్టారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రశ్నోత్తరాలు పెట్టాలని టీడీపీ గొడవ చేసిందని.. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. బీఏసీ సమావేశం నిర్వహించకముందే ఎందుకు ఆందోళన చేస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని.. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని.. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్‌ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారని.. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదని.. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారని.. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే అన్నారు. ఈ గందరగోళం మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.
అంతకముందు అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. జాబెక్కడ జగన్‌ అంటూ నినాదాలు చేశారు.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌ అన్నారని.. అధికారంలోకొచ్చాక జాబ్‌ క్యాలెండర్‌ లేదు.. ఉద్యోగాల భర్తీ లేదన్నారు టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు. టీడీపీ హయాంలో 7 డీఎస్సీలు వేశామని.. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img