Monday, May 6, 2024
Monday, May 6, 2024

రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంలో మార్చిన వైసిపి ప్రభుత్వం

ఏలూరు:ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం రావణ కాష్టంలా మర్చివేసిందని
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం స్థానిక 49వ డివిజన్ లోని మాజీ డిప్యూటీ మేయర్ నెరుసు గంగరాజు ఇంటి వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు తీసుకువచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ అవినీతి, స్కాంలను బయటపెడుతున్న టిడిపి నాయకులపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు సుదీర్ఘ రాజకీయచరిత్ర కలిగిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చరిత్రహీనులుగా మారిన కొంతమంది తో ముఖ్యమంత్రి జగన్ దారుణంగా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. గన్నవరంలో బంగారం పట్టివేత, అమరావతి రైతుల యాత్ర, దేశ రాజధానిలో లిక్కర్ స్కాం వంటివాటినుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసిపి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బడేటి చంటి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షేమం ముసుగులో సాగుతున్న రాక్షస పాలన కు సమాధి కట్టేందుకు ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 49 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి నాగరాజు, డివిజన్ ఇంచార్జ్నె రుసు గంగరాజు,జంపా సూర్యనారాయణ,సువ్వాడ గురుమూర్తి,అన్నవరపు వెంకటేశ్వరరావు,యనమల వెంకటేశ్వరరావు,అన్నవరపు పద్మ,అన్నవరపు సతీష్,వేముల రంగమ్మ,అద్దేపల్లి నాగమణి,గద్దె రాజ్ కుమార్,కాకని వెంకటేశ్వరరావు,కర్రె దావీదు,తాటిపాక గంగరాజు,మద్దుల గిరి, గొల్ల కొండలరావు,బోను వాసు, నెరుసు నాగేశ్వరరావు, బయ్యారపు శివ,తీరు వీధుల శ్రీను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img