Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ ప్రధాన ఆలయాలు

చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. మంగళవారం ఉదయం అభిషేకాల అనంతరం ఆలయాలను అధికారులు మూసివేశారు. సాయంత్రం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. అంతకుముందు పూజలు చేసి ఆలయం ప్రధాన ద్వారాలు మూసివేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలు కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే ఆర్జిత సేవలు కూడ నిలిపివేశారు. సాయంత్రం 6:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, ఆ తర్వాత ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి అనంతరం సంప్రోక్షణ, ప్రాదోశకాల పూజలు నిర్వహించి రాత్రి 8 గంటల నుంచి భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడిరచారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేశారు. శ్రీకాకుళం జిల్లా, అరసవెల్లి సూర్యదేవాలయం మూతపడిరది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకే అర్చకులు ఆలయాన్ని మూసివేశారు.చంద్రగ్రహణం నేపథ్యంలో తెలంగాణలోని బాసర సరస్వతి క్షేత్రం మూసివేశారు. పూజల అనంతరం ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాలకు తాళం వేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం, నిర్మల్‌ హరిహర క్షేత్రం, ఇతర అన్నీ ఆలయాలను మూసివేశారు. ఈ సందర్బంగా ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు చేశారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ఆలయాలు తెరుచుకోనున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సుప్రభాత పూజ, ప్రాతఃకాల పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img