Monday, May 6, 2024
Monday, May 6, 2024

అప్పయ్యపేటలో బాదుడే బాదుడు కార్యక్రమం

విశాలాంధ్ర, సీతానగరం: పెంచిన విద్యుత్ ఛార్జీలను,ఆర్టీసిబస్సుఛార్జీలు, గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు, నూనె ధరలు తగ్గించాలనికోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో పెధబోగిలిగ్రామ పంచాయతీలోని అప్పయ్యపేట గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంను నిర్వహించారు. బుధవారం సాయంత్రం మాజీఎమ్మెల్యే, నియోజక వర్గ ఇంఛార్జి బొబ్బిలి చిరంజీవులు అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని అన్నింటిలో బాదుడే బాదుడుఅంటూ నినాదాలు చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగుచెందుతున్నారని తెలిపారు. అన్ని ధరలు పెంచడం వల్ల పేద బడుగు బలహీన వర్గాలప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామీణప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాల ప్రజలపై ప్రభుత్వం బాదుడే.. బాదుడే తరహాలో అన్నిధరలను పెంచి వారిని అనేక రకాల ఇబ్బందులు పెడుతుందన్నారు. ఈకార్యక్రమంలో మండలటీడీపి అధ్యక్ష,కార్యదర్శులు కొల్లితిరుపతిరావు, రౌతు వేణుగోపాలనాయుడు, నియోజక వర్గ సీనియర్ నేత గర్భాపు ఉదయభాను సర్పంచ్ తేరేజమ్మగరికయ్య, సాలాహరి,బోనుచంద్రమౌళి,నాయకులు సబ్బాన శ్రీను,బుడితిశ్రీను, పైల నాగ భూషణరావు, లక్ష్మణ, యోగేశ్వరరావు, సూర్యనారాయణ, వెంకటనాయుడు, గుంపస్వామి, పారినాయుడు, సింహాచలం,శంకరరావు, సత్యనారాయణ, అప్పయ్యపేట టీడీపీ నాయకులు,అభిమానులు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img