Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పదోతరగతి విద్యార్థులకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

హెచ్ ఎం ఇళ్ళా ప్రసన్న లక్ష్మి

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విధ్యార్ధుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు
ప్రదానోపాధ్యాయురాలు ఇళ్లా ప్రసన్న లక్ష్మి తెలిపారు.శుక్రవారం ఆమె విశాలాంధ్రతో మాట్లాడారు. ప్రతీరోజు ఉదయం 8.30గంటల నుండి 9.30 గంటల వరకు,
సాయంత్రం4.00 గంటల నుంచి 5.00 గంటల వరకు రెగ్యులర్ గా ప్రత్యేక స్టడీఅవర్స్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులందరి సమిష్టి కృషితో ఈ స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతోందని చెప్పారు.విద్యార్థులను ఒక్కోటీచర్ దత్తత చేసుకుని విద్యార్థుల హాజరు మరియు వారు ఇంటివద్ద ఎలా చదువుతున్నారని తల్లిదండ్రులతో చర్చించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
విద్యార్థులను గ్రేడులుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతోందని,ఈఏడాది శతశాతం పలితాలు సాధించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందరి సమష్టి కృషితో ఉన్నతపాఠశాలలో పదోతరగతి పలితాలలోను, ఇతర అంశాల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img