Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఆయమన్న రోడ్లు లేవు…డ్రైనేజీలు.. పెరిగే.ధరలకు హద్దే లేదు….?

బీసీల ఆవేదన
విశాలాంధ్ర/చాట్రాయి :
బీసీల నివాస ప్రాంతాల్లో…. ఆయమన్న రోడ్లు లేవు ….డ్రైనేజీ లేదు ….పెరిగే ధరలకు హద్దే లేదంటూ …పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రైతుఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఇదేం కర్మ ఈరాష్ట్రానికి కార్యక్రమంలో బలహీన వర్గాల సామాజిక తరగతికి చెందిన కురుమ వీధులలో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను వారి ముందు ఏకరువు పెట్టారు. మా నివాస ప్రాంతాల్లో కనీసం ఒక్క సిమెంట్‌ రోడ్డు కూడా వేయించలేదని వాన కురిస్తే మురికి నీళ్ళు వెళ్లడానికి డ్రైనేజీలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్‌ బిల్లులు మాత్రం గణనీయంగా పెంచారు అన్నారు. గతం కన్నా అనేక రెట్లు కరెంట్‌ బిల్లు పెరిగింది అన్నారు. కొనుక్కునే సరుకుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి అన్నారు జగన్‌ పాలనలో మాపై మోయలేని భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గౌర వెంకటేశ్వరరావు పరసా శ్రీనివాసరావు ఎం.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img