Monday, May 6, 2024
Monday, May 6, 2024

జీవో నెంబర్ ఒకటిని వెంటనే ఉపసంహరించుకోవాలి

ఆత్మకూర్ సిపిఐ మండల కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : జీవో నెంబర్ ఒకటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి నీళ్లపాల రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని అమలులోకి తీసుకురావడం విచారకరమని ఆయన ఎద్దేవ చేశారు. ప్రతిపక్షాలు వామపక్ష పార్టీలు ఉద్యమాలు రాస్తారోకో ఆందోళన చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ఈ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని, జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని, ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఓబులేసు, మల్లికార్జున ,రామన్న ముత్యాలన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img