Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

రాజ్యసభ ఘటనపై క్షమాపణలు చెప్పాలి

మంత్రుల డిమాండ్‌
పార్లమెంట్‌లో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు ఎదురుచూస్తారని, కానీ విపక్షాలు అరాచకాన్ని సృష్టించాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాలను ముందుగా వాయిదా వేసిన ఘటనలో ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాలని ఇవాళ ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, రాజ్యసభలో జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ, జబుధవారం రాజ్యసభలో కొందరు ఎంపీలు.. టేబుళ్లు ఎక్కారని, వాళ్లకు వాళ్లు గర్వంగా ఫీలవుతున్నారని అన్నారు. విపక్షాల ప్రవర్తనా తీరు హేయంగా ఉన్నట్లు మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img