Homeఆంధ్రప్రదేశ్రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చూపిస్తాం: మంత్రి లోకేశ్‌

రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చూపిస్తాం: మంత్రి లోకేశ్‌

- Advertisement -

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే హబ్ ప్రధాన లక్ష్యమన్న‌ మంత్రి


ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ఎలాంటి అద్భుతాన్ని సృష్టించిందో, ఇప్పుడు అలాంటిదే రాయలసీమలో ఆవిష్కృతం కాబోతోందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మదనపల్లెలో ఏర్పాటు చేయబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (జీహెచ్‌హెచ్), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఈ ప్రాంత వ్యవసాయ రంగ రూపురేఖలను సమూలంగా మార్చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లెలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. విత్తనం నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తుల వరకు అన్ని దశల్లోనూ ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై దృష్టి సారిస్తాం. మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ఈ హబ్ ప్రధాన లక్ష్యం. కేవలం ఇతర రాష్ట్రాలకు కాదు, ఇతర దేశాల మార్కెట్లకు అవసరమైన మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ వంటి మేలైన వంగడాలను పండించి, రాయలసీమ రైతు సత్తాను ప్రపంచానికి చాటి చెబుతాంఁ అని స్పష్టం చేశారు.

యువగళం నుంచే మిషన్ రాయలసీమ పుట్టింది
యువగళం పాదయాత్రలో తాను 124 రోజుల పాటు రాయలసీమలో పర్యటించినప్పుడు రైతుల కష్టాలను కళ్లారా చూశానని లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు. ఁనాపై సోడా బాటిళ్లు, రాళ్లతో దాడులు చేసినా వెనక్కి తగ్గకుండా 1,587 కిలోమీటర్లు నడిచాను. ప్రతి రోజూ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నాను. ఆ అనుభవంతోనే 2023 జూన్ 7న కడపలో ఃమిషన్ రాయలసీమః ప్రకటించాను. అందులో ప్రధానమైనదే ఈ హార్టికల్చర్ హబ్. ఆనాటి కల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు సహకారంతో ఈరోజు నిజమవుతోందిఁ అని వివరించారు.

రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకు రైతుల కష్టాలు బాగా తెలుసని లోకేశ్‌ అన్నారు. ఁఈ మధ్య ఒక ఆంగ్ల పత్రిక చంద్రబాబును ఃవాటర్ మ్యాన్ః అని అభివర్ణించింది. అది చూసి గొడ్డలి పార్టీ నేతలు ఏడుస్తున్నారు. సీమ రైతులకు వరంలాంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని ఎత్తేసింది ఎవరు? పట్టిసీమతో ప్రయోజనం లేదన్నది ఎవరు? పోలవరం అర్థం కాలేదన్నది ఎవరు? అని నేను వారిని ప్రశ్నిస్తున్నాను. 1997లోనే ఇజ్రాయెల్ టెక్నాలజీతో సీమకు బిందు సేద్యాన్ని పరిచయం చేసి, కరవు నేలను సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుది. తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను దేవాలయాల్లా భావించి పూర్తి చేసే సంకల్పం ఆయనది. అందుకే ఆయన్ను అందరూ వాటర్ మ్యాన్ అంటున్నారుఁ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఐఎస్‌బీ స్ఫూర్తితో ఐఎస్ఏ
చంద్రబాబు ముందుచూపునకు ఐఎస్‌బీ నిలువెత్తు నిదర్శనమని లోకేశ్‌ అన్నారు. ఁదేశంలోని పారిశ్రామికవేత్తలు వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ పెట్టాలనుకున్నప్పుడు, వారి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) లేకపోయినా, చంద్రబాబు పట్టుదలతో వారిని ఒప్పించి హైదరాబాద్‌కు ఐఎస్‌బీని తీసుకొచ్చారు. స్వయంగా ప్రజెంటేషన్ ఇచ్చి, వారిని మెప్పించారు. ఆ ఐఎస్‌బీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అదే స్ఫూర్తితో, అంబానీ కుటుంబం వంటి వారి సహకారంతో ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) కూడా మన రైతుల కోసం ప్రపంచ స్థాయి సంస్థగా ఎదుగుతుందిఁ అని లోకేశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మదనపల్లె చారిత్రక ప్రాధాన్యతను, ఃజన గణ మనః గీతానికి ఇక్కడి బీటీ కాలేజీలో ఆంగ్లానువాదం జరగడాన్ని గుర్తుచేస్తూ, ఇంతటి గొప్ప గడ్డపై ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు