Monday, May 6, 2024
Monday, May 6, 2024

గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి గరుడ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గరుడ సేవ కార్యక్రమం తిరుమల తిరుపతిలో జరిగే సాంప్రదాయ పద్ధతిలో కూడా ధర్మవరంలో ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం దాతలు, భక్తాదులు, ఆలయ అర్చకుల నడుమ అత్యంత వైభవంగా గరుడసేవను నిర్వహించారు. ఈ గరుడ సేవకు దాతలుగా కీర్తిశేషులు దాసెట్టి ఓబులమ్మ జ్ఞాపకార్థం దాశెట్టి నారాయణస్వామి వీరి కుమారులు వ్యవహరించడం జరిగింది. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, వేదమంత్రాలు,మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలను నిర్వహించడంతోపాటు వివిధ పూలలతో పూల అలంకరణ చేసిన వైనం విశేషంగా ఆకట్టుకుంది. ప్రతినెలా దాతల సహాయ సహకారాలనుతో ఈ గరుడసేవను నిర్వహించుట తమకెంతో సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ధర్మవరం పట్టణం సుఖశాంతులతో వెలగాలని, పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని భక్తి భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. పట్టణంలోని గోదా రంగనాథ మహిళా మండలి భవాని ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పట్టణ పురవీధులలో స్వామి వారిని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ వైస్ చైర్మన్ కుండా చౌడయ్య, ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకటేశులు, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాళ్ళ పుల్లయ్య వారి శిష్య బృందం,కమిటీ సభ్యులు పొరాళ్ళ పద్మావతి, విజయలక్ష్మి, జగ్గా బరిని, అజంతా కృష్ణ, ఆలయ సిబ్బంది, దాతలు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img