Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్త్రీల సాదికారత సాదనే కీలకం

ఐసీడీఎస్ పీడీ విజయగౌరీ
విశాలాంధ్ర,పార్వతీపురం: స్త్రీలు సాధికారత సాధించినప్పుడే ప్రస్తుతం వున్న అనేకసమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా స్త్రీ, శిశుసంక్షేమశాఖ సాధికార అధికారి కె. విజయగౌరి అన్నారు. బుధవారంనాడు జిల్లా కేంద్రంలో స్నేహకళాసాహితి, జనవిజ్ఞాన వేదికల సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంను నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.ఇంకా మహిళల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు. స్నేహకళా సాహితి వ్యవస్థాపకులు, ప్రముఖ కథా రచయిత గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా వున్నమహిళలు మరింత స్వేఛ్ఛా సమానతలు సాధించే సమాజం కోసం ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళలు స్వేచ్ఛా జీవితాన్ని సాధించినప్పుడే వారికి సముచిత స్థానం దక్కినట్లని చెప్పారు.ఈ సమావేశానికి వలిరెడ్డి ప్రమీల అధ్యక్షత వహించగా సమావేశంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న గంగాడ సత్యవతి, గండ్రేటి అసిరమ్మలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో రచయితలు మల్లిపురం జగదీశ్, ఫరూక్, పక్కి రవీంద్రనాథ్, చందనపల్లి గోపాలరావు, సిరికి స్వామినాయుడు, పల్ల రోహిణికుమార్, అర్. వాసుదేవరావు, పారినాయుడు,ఎన్.గౌతమి,జె.శ్రీదేవి తదితరులు పాల్గొని ప్రసంగించగా పలువురు సామాజిక స్పృహ వ్యక్తులు,మహిళలు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img