Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ నందు సోమవారం వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు కలసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ చంద్రబాబు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇంటి పట్టాలు పట్టణాలలో ఒక సెంటు స్థలంలో లబ్ధిదారుల పేరుట రిజిస్టర్ చేయించి ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం మంజూరు చేస్తున్న సెంటు స్థలంలో శవాలను పూడ్చడానికి కూడా సరిపోదని ఎగతాళి చేయడం ప్రజలను అవమాన పరచడమేనని ఇల్లు లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కాబట్టి తను ఇవ్వక ఇతరులు ఇచ్చేదాన్ని ఎగతాళి చేయడం లబ్ధిదారులలో అనుమానాలు కలిగించే విధంగా ప్రకటనలు చేయడం మంచిది కాదని కోరుతూ వైఎస్ఆర్సిపి నాయకులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మలు కాల్చి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ కౌన్సిలర్లు రామాంజనేయులు, యాసిన్, శేషాద్రి, కన్వీనర్ నరసింహులు, తయ్యూబ్, సద్దాం, తిరుపాల్ నాయక్, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img