Monday, May 6, 2024
Monday, May 6, 2024

మరో రెండ్రోజులు ఏపీలో వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడిరది.దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ వెల్లడిరచింది. కోస్తాంధ్రాలో మంగళవారం వరకు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img