Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వీరబ్బాయి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదిద్దాం పర్యావరణ పరిరక్షణకు పాటుపడడాం అని ప్రతిజ్ఞ చేశారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ చెట్లను నాటి, వాటిని సంరక్షించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కోరారు.పర్యావరణాన్ని కాపాడేందుకు, సంరక్షించేందుకు ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తూ ఏటా జూన్ 5 న జరుపుకునేదే ప్రపంచ పర్యావరణ దినోత్సవమని అన్నారు. ఈ ప్రత్యేక రోజున అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పర్యావరణం ప్రాముఖ్యత గురించి తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం శాంపంగా కనిపించే ముప్పని.. అది అన్ని వర్గాలపైనా ప్రభావం చూపుతుందని..దీన్ని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. దీనికోసం సరైన, సమర్థవంతమైన పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డా. నారాయణ స్వామి, డా.చెన్న కేశవులు ,డెమో భారతీ,డిప్యూటీ డెమో త్యాగరాజు, సుబ్రహ్మణ్యం, కిరణ్ శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img