Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు…

తొగట వీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు బండారు ఆదినారాయణ
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని తొగట వీర క్షత్రియ కుల విద్యార్థులకు పట్టణ తొగట వీర క్షత్రియ సేవా సంఘం వారు 2023 సంవత్సరములో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతూ అత్యధిక మార్కులు అనగా 540 మార్కులకు పైగా సాధించిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులను ఇవ్వనున్నట్లు పట్టణ తోగట వీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు బండారు ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులు మార్కుల పత్రము,ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రముల యొక్క జిరాక్సులను ఈనెల 13వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలని వారు తెలిపారు. తదుపరి ఈనెల 17వ తేదీ శనివారం శ్రీ తొగట వీర క్షత్రియ కళ్యాణ మండపము నందు సాయంత్రం నాలుగు గంటలకు నగదు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440209995 లేదా 9440565933 లేదా 9440 844 383 కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img