విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ ఐసిడిఎస్ కార్యాలయం నందు బుధవారం అంగన్వాడి సిబ్బంది మరియు ఆయాలు సూపర్వైజర్లు వర్కర్లు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సి డి పి ఓ శాంత లక్ష్మి డిఎల్డిఓ శివారెడ్డి పాల్గొని మహిళల ఉద్దేశించి ప్రసంగించారు మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని మహిళలు శ్రమజీవులని వారికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు అవసరమని వీటి ద్వారానే మహిళలు రక్షింపబడుతున్నారని మహిళలు శాంత స్వభావులని పురుషులతో పోటీపడి నేటి మహిళలు రాణిస్తున్నారని అలాగే పురుషులతోపాటు పోటీపడి అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారని వారు తెలిపారు ఇప్పుడు మహిళలు పురుషులతో పోటీపడి చదువు అన్ని రంగాలలోనూ రాణించడం వలన శ్రీ శక్తి పెరుగుతుందని వారు తెలిపారు మహిళా దినోత్సవానికి ప్రత్యేక పోటీలు నిర్వహించిన వారికి ఉద్యోగ బాధ్యతలు ప్రత్యేకంగా రాణించిన వారికి బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సుజాత అలివేలమ్మ అనురాధ పుష్పలత ఈరమ్మ 6 మండలాల అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.