Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఇంటర్ కాలేజీ పోటీలలో మిట్స్ కళాశాల విజయభేరి

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : 11 వ జేఎన్టీయూ అనంతపురం ఇంటర్ కాలేజీ పోటీలలో మిట్స్ కళాశాల విజయభేరి మోగించింది అని కళాశాల ప్రిన్సిపల్ డా.సి. యువరాజు పేర్కొన్నారు. గూడూరు ఆడిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పోటీలలో బాస్కెట్‌బాల్ పురుషుల విజేతలు , మహిళల టెన్నికాయిట్ డబుల్స్ విజేత మహిళల సింగిల్స్ టెన్నికాయిట్ విజేతలు గా నిలిచారు అన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెట్ డాక్టర్. యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, ఫిసికల్ డైరెక్టర్ దామోదరన్ అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img