Friday, April 26, 2024
Friday, April 26, 2024

గురుకుల ఉద్యోగులను అప్కోస్ లో విలీనానికి ఎమ్మెల్సీ, శివరామి రెడ్డి కృషి

విశాలాంధ్ర -ఉరవకొండ : రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలె బి.సి. గురుకుల పాఠశాలలో పనిచేయుచున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వము ఏర్పాటు చేసిన అప్కోస్ లోనికి విలీనము చేయడానికి ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి కృషి చేశారని ఉద్యోగుల యొక్క సమస్యను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేసినట్లు ఉద్యోగుల సంఘ అధ్యక్షులు జి.వి. రమణ మరియు కార్యదర్శి సి.హెచ్. శివకాంత్ మరియు ఇతర సభ్యులు హర్ష వ్యక్తం చేశారు..దాదాపు 1400 మంది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గురుకుల పాఠశాలలో వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీల క్రింద కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని వారికి సదరు ఏజెన్సీలు సకాలములో వేతనాలు చెల్లించడం లేదని మరియు ఎటువంటి ఇ.పి.యఫ్/ఇ.హెచ్.యస్ మొదలగు వంటి ప్రభుత్వ పథకాలు కూడా లభించడం లేదని వారిని తక్షణమే ప్రభుత్వము ఏర్పాటు చేసిన అప్కోస్ (ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ ఔట్సోర్స్ సర్వీసెస్) లోనికి విలీనము చేయాలనీ అనేక రోజులుగా పోరాటాలు నిర్వహిస్తున్నామని న్యాయమైన సమస్య ఎమ్మెల్సీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. మంగళవారం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img