Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఖోఖో క్రీడల ఖిల్లాగా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్

వేసవి శిక్షణ శిబిరం ముగింపులో వక్తలు

విశాలాంధ్ర-రాప్తాడు : ఖోఖో క్రీడల ఖిల్లాగా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ విరాజిల్లుతూ ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఖోఖో క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో నిలవడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీ నిట్టూరు కేశవమూర్తి పర్యవేక్షణలో నెలరోజులపాటు నిర్వహించిన ఖోఖో వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థిని విద్యార్థులను ఒక చోటికి చేర్చి ఉదయం, సాయంత్రం శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీమని వక్తలు తెలిపారు. నెల రోజులపాటు విద్యార్థులకు పోషకాహారం అందించడం మరువలేనిదని పీడీ కేశవమూర్తి తెలిపారు. రాప్తాడులోని విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే సహాయ సహకారాలు అందించడానికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దండు రామాంజినేయులు, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, సర్పంచ్ సాకే తిరుపాలు, ఏపీ సాఫ్టుబాల్ సీఈఓ సి.వెంకటేసులు, పీడీ రమేష్, కోచ్ లు చిట్రా ఆదినారాయణ, తరుణ్, చైతన్య పాల్గొన్నారు. .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img