Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఆర్జెడి ప్రతాప్ రెడ్డిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలి. ఏఐఎస్ఎఫ్

విశాలాంధ్ర- ధర్మవరం : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు పట్టణంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగాఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య,నియోజకవర్గ అధ్యక్షుడు శివ మాట్లాడుతూ, ఆర్జెడి ప్రతాపరెడ్డి అధికారిగా కాకుండా, అధికార పార్టీ ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడటం దారుణమన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం, కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రహస్య సమావేశాలు నిర్వహిస్తూ ఉండడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ఎన్నికల ఏజెంటుగా ఉన్న ఆర్ జెడ్ ప్రతాపరెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించి సస్పెండ్ చేయాలని , ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించినప్పటికీ, లెక్కచేయకుండా అహంభావంతో, హెచ్ఎంలతో, ప్రభుత్వ ఉపాధ్యాయులతో రహస్య సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆర్జెడి ప్రతాపరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకుల కుమార్, నవీన్, మురళి, వినోద్, మహమ్మద్, చందు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img