Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త

ఉరవకొండ సర్పంచ్‌ మీనుగా లలిత
విశాలాంధ్ర` ఉరవకొండ :
మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తని ఆయన యొక్క ఆలోచనలు ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉరవకొండ మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ మీనుగా లలిత అన్నారు. సోమవారం జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉరవకొండ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్‌ మాట్లాడుతూ సంఘ సంస్కర్త ఆలోచన వరుడు సమాజంలో అట్టడుగు వర్గాల వారిని చైతన్య పరచడంలో ఆయన చేసిన పోరాటాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించాడన్నారు కుల వ్యతిరేక ఉద్యమంలో కూడా ఆయన ఎన్నో పోరాటాలను నిర్వహించారన్నారు. సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు అయినా పూలే యొక్క గొప్పతనాన్ని మానవత్వాన్ని అణగారిన ప్రజల కోసం ఆయన పోరాడిన ఉద్యమాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని పూలే యొక్క అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు,నరసింహులు బ్యాంకు ఓబులేసు, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, బసవరాజు, సలీం, మహేష్‌, వార్డు సభ్యులు, వసికేరి మల్లికార్జున, చేజాల ప్రభాకర్‌, ఆసిఫ్‌ ఓబన్న, గందోడి మరేష్‌ ప్రసాద్‌ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img