Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బెస్త సంఘం అధ్యక్షులుగా తిప్పయ్య

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం బెస్త సేవా సంఘం కమిటీని గురువారం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ, కార్యదర్శి భాస్కర్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గం అధ్యక్షులుగా బెస్త తిప్పయ్య, కార్యదర్శులుగా ఎం. ఎర్రి స్వామి( మరుట్ల) వన్నూరు స్వామి (విడపనకల్లు) కోశాధికారిగా బెస్త సర్వేష్‌ (ఉరవకొండ) గౌరవాధ్యక్షులుగా రామాంజనేయులు (ఉరవకొండ) రామన్న (ఉరవకొండ) నాగన్న (ప్యాపిలి)ఎర్రిస్వామి (విడపనకల్లు) వీరితో పాటుగా ప్రతి మండలం నుంచి 5 మంది ఉపాధ్యక్షులు 5 మంది సహాయ కార్యదర్శులు మొత్తం 56 మందితో నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన తిప్పయ్య మాట్లాడుతూ బెస్త కులస్తుల యొక్క సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు తనను నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img