Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 3,205 పాజిటివ్‌ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 2వేలకు పైగా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,205 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,84,984కి చేరాయి. ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది.కాగా.. గత 24 గంటల్లో 281 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,63,255కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 10,119 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఏపీలోని రెండు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరులో 607 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నంలో 695 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరులో 203, విజయనగరంలో 212 కేసులు, గుంటూరులో 224 కేసులు చొప్పున నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img