Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది : నారా లోకేష్‌

ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం లేఖ రాశారు. చేనేత రంగానికి మరణశాసనంగా మారిన జీఎస్టీ పెంపు అంశంపై..కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్లే చేనేత రంగం సంక్షోభంలో పడిరదన్నారు.చేనేత సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే.ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచడం దారుణమని, ఈ నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిరదన్నారు.చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తమిళనాడు, తెలంగాణ వ్యతిరేకిస్తున్నా..ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చేనేత రంగంపై.. జీఎస్టీ భారం 5 శాతాన్ని మించకుండా సబ్సిడీలు కల్పించాలని కోరారు. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img