Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పేదల గృహ రుణాలపై వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం

మంత్రి పేర్ని నాని
పేదల గృహ రుణాలపై వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి 2011 ఆగష్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలపై లోన్లు తెచ్చుకునే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వారి సొంత ఆస్తిగా మార్చి ఇచ్చేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా 46,61,737 మంది లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం పొందవచ్చన్నారు. మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల పరిధిలోని వారు రూ.20 వేలు చెల్లించి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించామని మంత్రి పేర్ని నాని అన్నారు. నాడు-నేడులో భాగంగా విరాళాలిచ్చే దాతల పేర్లు స్కూళ్లు, ఆస్పత్రులకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img