Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

వైఎస్‌ వివేకా హత్యకేసుపై సునీతారెడ్డి పిటిషన్‌.. సీబీఐ, జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదని.. మరో రాష్ట్రానికి బదిలీ చేసి పర్యవేక్షించాలని సునీతారెడ్డి కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 14కు వాయిదా వేసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని వైఎస్‌ సునీతారెడ్డి పిటిషన్‌లో ప్రస్తావించారట. సీబీఐ అధికారులకు కూడా బెదిరింపులు వస్తున్నాయని.. అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ సాగించాలని ఆమె కోరుతున్నారట. 2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య జరగ్గా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు దర్యాప్తు చేసేందుకుసిట్‌ను ఏర్పాటు చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.. తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించగా.. దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానితుల్ని, సాక్షుల్ని వరుసగా ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఏ2గా సునీల్‌ యాదవ్‌, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డిలు ఉన్నారు.. మరికొందర్ని కూడా సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img