Friday, April 26, 2024
Friday, April 26, 2024

కదిరి రైల్వే గేట్ వద్ద తప్పిన పెను ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ రైల్వే గేటు వద్ద పెను ప్రమాదం తప్పింది. కూటగుళ్ల రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయానికి గేట్‌మెన్ గేటు వేయలేదు. దీంతో వాహనాలు రైల్వే క్రాసింగ్ మీదుగా అటూ ఇటూ యథేచ్చగా తిరిగాయి. ఇంతలో అటు వైపు ఓ రైలు వచ్చింది. రైలు రాకను గమనించి కొంత మంది వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. ఇరువైపులా ఉన్న వారిని హెచ్చరించారు. ఇదే సమయంలో ట్రైన్ లోకో పైలట్‌ కూడా అక్కడ గేటు వేయకపోవడాన్ని గమనించి రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం (జూన్ 2) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

చెన్నై హైవేకు సమీపంలో ఉన్న ఈ రైల్వే క్రాసింగ్ వద్ద ఎప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. రైలు వచ్చే సమయంలో రైల్వే గేట్ వద్ద సిబ్బంది ఎవరూ లేరు. నిలిపివేసిన రైలు ఇంజిన్ నుంచి రైల్వే సిబ్బంది ఒకరు కిందకి దిగివచ్చి గేటు వద్ద కార్యాలయంలో పనిచేశారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఎవరూలేరని ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. గేట్ వద్ద ఓ వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడని.. తాను వచ్చేసరికి అతడు కూడా లేచి పారిపోయాడని ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనతో హైవే వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఒడిశాలో రైలు దుర్ఘటన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img