Friday, April 26, 2024
Friday, April 26, 2024

మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్‌..

అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాలు పంపిణీ
బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌
పాము కాటుతో ఆస్పత్రిలో చేరిక.. బుధవారం మృతి

అమరావతి ప్రాంతంలో పాము కాటుకు గురైన కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌ ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ని మంగళవారం వేకువజామున పాము కరిచిన సంగతి తెలిసిందే. వెంటనే గమనించి పామును చంపేసి.. కానిస్టేబుల్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పవన్‌ కుమార్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల దగ్గర అభివృద్ధి పనుల బందోబస్తుకు తోటి సిబ్బందితో కలిసి వచ్చారు. రాత్రి సమయంలో కూడా పోలీసులు గ్రామాల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు భోజనాలు ముగించుకున్నారు. ఆ తర్వాత అనంతవరం లే అవుట్‌ దగ్గర కొండ దగ్గర ఆలయంలో మెట్ల ముందు ఉన్న గచ్చుపై పడుకున్నారు.ఇంతలో కట్లపాము కానిస్టేబుల్‌ పవన్‌ కుడి భుజంపై కాటు వేసింది. ఆయన వెంటనే ఉలిక్కిపడి లేచారు.. ఆ పామును చేతితో పట్టుకొని లాగారు. ఆ పాము మళ్లీ పవన్‌ ఎడమ చేతిపై కాటు వేసింది. వెంటనే తోటి సిబ్బంది ఆ పామును చంపేశారు. మొదట పవన్‌ కుమార్ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పవన్‌ కుమార్‌ మరణంతో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. పవన్‌ కుమార్‌ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి.. అమరావతిలో పాముకాటుకు గురైన కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌ మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. రాజధానిలోని ఆర్‌-5 జోన్‌ లో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. పవన్‌ కుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img