Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు..ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన కేటీఆర్‌

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు విశాఖ ముస్తాబైంది. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు సాగరతీర నగరంలో జరిగే సమ్మిట్‌కు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటూ జరిగే సదస్సుకు వచ్చే అతిథుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం రాత్రి విశాఖ వెళ్లనున్నారు.. మూడు రోజుల పాటూ అక్కడే ఉంటారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. రూ.2 లక్షల కోట్ల పెట్టబడులు వస్తాయని అంచనా వేస్తోంది. 12 వేలకుపైగా రిజిస్ట్రేషన్స్‌ నమోదు అయ్యాయి.ఇదిలా ఉంటే.. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని.. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ఆకాక్షించారు. సమ్మిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన కేటీఆర్‌కు ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో తొలి రోజు (మార్చి 3న) ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షత జీఐఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులను ఆహ్వానిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవం.. మొత్తం 9 రంగాలపై చర్చలు జరుగుతాయి. రెండోరోజు ( మార్చి 4న) ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. రెండో రోజు 6 రంగాలపై చర్చలు జరగనున్నాయి. సీఎం ఆధ్వర్యంలో ఒప్పందాలు తర్వాత ముగింపు సమావేశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img