Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఏపీలో ఈ ప్రాంతాల్లో 3 రోజులు భారీ వర్షాలు

ఏపీలో మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం మీద కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 5.1 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొలది నైరుతి దిశగా ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడిరచింది. దీంతో శుక్రవారం తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ.. దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి శనివారం బలహీనపడినదని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ శాఖ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం: శని, ఆది, సోమవారాల్లో (అక్టోబర్‌ 1, 2, 3 తేదీలు) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్‌ ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర: శని, ఆది, సోమవారాల్లో (అక్టోబర్‌ 1, 2, 3 తేదీలు) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది. అలాగే, ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ: శని, ఆది, సోమవారాల్లో (అక్టోబర్‌ 1, 2, 3 తేదీలు) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే ఛాన్స్‌ ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img