Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

నగరి నుంచి పోటీ చేయడం తథ్యం : నటి వాణి విశ్వనాథ్‌

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తనకు వేలాదిగా అభిమానులు ఉన్నారని, వారి కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సినీనటి వాణీ విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం ఆమె నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తానని ఇప్పుడే చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే ఎన్నికల్లో నగరి నుండి పోటీ చేయడం మాత్రం తథ్యమన్నారు. తమ మేనేజర్‌ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడినట్లు చెప్పారు. నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేశారని, ఈ ప్రాంత వాసులు తమకు సుపరిచితులని గుర్తు చేశారు. నగరిలో తమిళ, సంస్కృతి ఉందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసి ప్రజా సమస్యల పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img