Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ

అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడిరచారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. ఈ సంధిగ్ధతను తొలగించేందుకు మండలిని తిరిగి కొనసాగించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులే ఎప్పుడైనా సుప్రీం. అయితే ఒక సూచన, సలహా ఇవ్వడానికి మండలి అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు శానసమండలే లేదు. జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశాం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమిది. ఇటీవల శానసమండలి ఛైర్మన్‌ను కూడా ఎన్నుకున్నాం అని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img