Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటు : నాదెండ్ల మనోహార్‌

భీమ్లానాయక్‌ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పెట్టుబడులు పెడితే ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని గతంలో సీఎం చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించి సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటు.’ అని అన్నారు. సీఎం జగన్మోహాన్‌రెడ్డి ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆత్మాభిమానంకు, అహాంకారానికి జరిగిన పోరాటామే భీమ్లానాయక్‌ సినిమా ఇతివృత్తమన్నారు.చివరకు ఆత్మాభిమానమే విజయం సాధిస్తోందన్నారు. సీఎం జగన్‌ కేవలం అహంకారంతోనే ఇలా వ్యవహారించారని దుయ్యబట్టారు. కర్ప్యూలాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. కక్ష పూరితంగా, చిన్నమనస్తత్వంతో సామాన్యూలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. తన ఆలోచన మేరకే పనిచేయాలని నియంతలా సీఎం జగన్‌ వ్యవహారిస్తున్నారని నాదెండ్ల మనోహార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యన్ని నమ్మే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా..సమయం వచ్చింది. ఆత్మగౌరవంతో ఉన్న వారంతా వైసీపీ నుంచి బయటకు రావాలి.మాతో కలిసి ముందుకు నడవండి. పవన్‌కల్యాణ్‌ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img