Monday, May 6, 2024
Monday, May 6, 2024

80 లక్షల ఆఫ్‌లైన్‌ మర్చంట్లను డిజిటల్‌కు మార్చిన ఫోన్‌పే

ముంబయి: ఆర్‌బీఐ పీఐడీఎఫ్‌ (పేమెంట్ల మౌలిక వసతుల అభివృద్ధి నిధి)లో భాగంగా గత 18 నెలల్లో 80 లక్షల ఆఫ్‌లైన్‌ మర్చంట్లను డిజిటలీకరణ చేశామని భారతదేశపు అగ్రగామి ఫిన్‌ టెక్‌ వేదిక ఫోన్‌పే ప్రకటించింది. దేశంలోని మూడో శ్రేణి నుండి ఆరో శ్రేణి కేంద్రాలలో, ఈశాన్య రాష్ట్రాల్లోపాయింట్స్‌ ఆఫ్‌ సేల్‌ మౌలిక వసతులు (ఫిజికల్‌ మరియు డిజిటల్‌ పద్ధతులు) వినియోగాన్ని రాయితీ చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ పేమెంట్ల మౌలిక వసతుల అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. పీఐడీఎఫ్‌ పథకం ద్వారా, దేశం నలుమూలలా డిజిటల్‌ పేమెంట్‌ మౌలిక వసతులను రెట్టింపు చేసి, డిజిటల్‌ పేమెంట్ల వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటివరకు డిజిటల్‌ బాట పట్టని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మౌలిక వసతులను తీసుకువెళ్లగలుగుతుందని ఫోన్‌పే ఆఫ్‌ లైన్‌ బిజినెస్‌ హెడ్‌ వివేక్‌ లోచబ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img