Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒక్క సినిమా అని చెప్పి మూడు చేశా : తాన్యా రవిచంద్రన్‌


చెన్నై : ‘‘చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. అయితే నా తల్లి దండ్రులు చాలా స్ట్రిక్ట్‌గా ఉండడంతో నేను తాతయ్య రవిచంద్రన్‌కు నా ఇంట్రెస్ట్‌ గురించి ఎప్పుడూ చెప్పలేదు. దురదృష్టవశాత్తూ… నేను సినిమాల్లోకి వస్తానని ఆయనకు తెలియకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాతయ్యకు కష్టపడే తత్వం, అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. ఆ మూడు లక్షణాలను తాతయ్య నుంచి నేర్చుకున్నాను’’ అని తాన్యా రవిచంద్రన్‌ అన్నారు. ప్రముఖ తమిళ నటుడు రవిచంద్రన్‌ మనమరాలు ఈమె. కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ చిత్రం తాన్యా తెలుగువెరకు పరిచయమవుతున్నారు. శ్రీసరిపల్లి దర్శకుడిగా ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘‘చెన్నైలో పి.జి చదువుతున్న సమయంలో తమిళ సినిమాల నుంచి అవకాశాలొచ్చాయి. పీజీ పూర్తి చేశాక ప్రయత్నించమని ఇంట్లో వాళ్లు చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పా. వరుసగా మూడు సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పీజీ పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. దర్శకుడు చెన్నైలో కథ నెరేట్‌ చేశారు. హీరోయిన్‌ పాత్రకు మంచి అవకాశం ఉండడంతో అంగీకరించా. స్పై యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ఇది. ఇందులో క్రాంతి అనే అమ్మాయిగా కనిపిస్తా. హోమ్‌ మంత్రి కూతురు అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉండే పాత్ర అది. నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. కార్తికేయతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బావుంది. చాలా స్వీట్‌ అండ్‌ ఫ్రెండ్లీ. తన నటన సహజంగా ఉంటుంది. దర్శకుడు ఏదైతే నాకు చెప్పారో… అదే తెరకెక్కించారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నా. ఇప్పుడు తాతయ్య ఉంటే నన్ను చూసి చాలా ఆనందించే వారు. నేనూ ఎంతో హ్యాపీగా ఫీలయ్యేదాన్ని’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img