Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. కీలక వడ్డీ రేట్లు పెంపు !

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కీలక ప్రకటన చేశారు. బుధవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ మీటింగ్‌ నిర్వహించిన శక్తికాంత్‌ దాస్‌ కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించారు. వడ్డీ రేట్లను 40 బేసిస్‌ పాయింట్లు పెంచేందుకు మానిటరీ పాలసీ కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచేందుకు ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, తక్షణమే ఈ వడ్డీ రేటు అమల్లోకి వస్తుందని శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరుకుంది. స్టాండిరగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటు ప్రస్తుతం 4.15 శాతం వద్ద, మార్జినల్‌ స్టాండిరగ్‌ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 4.65 శాతం వద్ద ఉన్నాయి.దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు భారీగా పెరగడంతో.. ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ కుదేలైంది. ఈ దెబ్బకు బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img