Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆ అంశాలపై ప్రధానితో మాట్లాడుతా .. : మమత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం దిల్లీకి పయనమయ్యారు. అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లాడారు. దిల్లీ వెళ్లాక ప్రధానిని కలుస్తా, బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని పెంచడం, త్రిపురలో హింస గురించీ మాట్లాడుతా అని అన్నారు. త్రిపురలో పార్టీ కార్యకర్తలపై దాడికి వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు చేపట్టే ధర్నాలో పాల్గోకపోయినా సంపూర్ణ మద్దతిస్తానన్నారు. త్రిపురలో హింసపై కేంద్ర హోంమంత్రిని కలవాలని వేచివున్న టీఎంసీ ఎంపీలను కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘దిల్లీకి వెళ్లాక ప్రధానితో భేటీ అవుతా. బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధి విస్తరణ, త్రిపుర హింసతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చిస్తాను. ఈశాన్య రాష్ట్రంలో ఇంతటి కర్కశత్వాన్ని మానవహక్కుల కమిషన్‌ ఎందుకని పట్టించుకోవడం లేదో అంతుపట్టడం లేదు. త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్‌, ఆయన ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోంది. వారు ప్రజలకు సమాధానం చెప్పుకోక తప్పదు. చట్ట ప్రకారం ఈ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతా. స్థానిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ పోటీ చేయరాదని త్రిపుర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’ అని మమత అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img