Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం వైఎఫ్‌ పోరుబాట

నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్ర, లెనిన్‌బాబు

విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు/ నందిగామ : రాష్ట్రంలోని జిల్లాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య పోరుబాటపట్టింది. స్థానిక సమస్యలు పరిష్కరించాలనీ, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తదితర డిమాండ్లతో పాటు ఆయా జిల్లా ల్లోని సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సోమవారం నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కర్నూలు జిల్లా సమగ్రాభి వృద్ధిని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో జీపుజాతాను ప్రారంభిం చారు. ఈ జాతా ఈ నెల 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి పై జిల్లా లోని ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిం చడం దారుణమని అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చించి అధిక నిధులు విడుదల కోసం కృషి చేయాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌ బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని అయిన కర్నూలు జిల్లా పాలక పార్టీల విధానాల వల్ల విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. జిల్లా నుంచే ఆర్థిక మంత్రి ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధి కోసం నిధులు రావడం లేదన్నారు. ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పులి శేఖర్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాటాడి అధిక నిధులు రాబట్టి లేకపోతే ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్లు బిషన్న, చంద్రశేఖర్‌, రాజీవ్‌, కార్యవర్గ సభ్యులు విష్ణు, రవి, సభ్యులు చిన్న, సుధాకర్‌, శేషన్న, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికి పోరు
నందిగామలో పేపర్‌ పరిశ్రమ ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివక్ష చూపుతున్నారనీ, బందరు పోర్టు, చింతల పూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ అభివృద్ధి చేయాలన్న ఆలోచనే ముఖ్య మంత్రికి లేదనీ అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి.కోటేశ్వరరావు, అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి. రాజేంద్ర బాబు విమర్శించారు. కృష్ణాజిల్లా సమగ్ర అభివృద్ధి, నందిగామలో పేపర్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, బందరు పోర్ట్‌, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు జాతాను సోమ వారం నందిగామలో కోటేశ్వరావు, రాజేంద్ర, సీపీఐ నియోజక వర్గ కార్య దర్శి చుండూరు సుబ్బారావు జెండా ఊపి ప్రారంభించారు. జాతా ప్రారంభానికి ముందు అమరజీవి సూర్యదేవర నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగ్గయ్యపేటలో స్టీల్‌ కారి డార్‌ ఏర్పాటు చేస్తామని స్వయానా ముఖ్యమంత్రి ప్రకటించినా నేటికి ఆచరణ సాధ్యం కాలేదనీ, నూజివీడులో మామిడి జ్యూస్‌ పరిశ్రమ ఎన్నికల సమయంలో వాగ్దానాలకు, ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందన్నారు. జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయడంతోపాటు కృష్ణానది పరివా హక ప్రాంతం, సముద్రతీరంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పడమట నరేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి అరుణ్‌ కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి కొమ్మినేని. మురళి, అలవాల. చిన్నయ్య, శివయ్య, భాను, శ్రీను, ప్రసన్న కుమార్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img