Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఉత్తర్వులు అమలయ్యేనా?

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల ఖరారు
నర్సరీ నుంచి 10 తరగతులకు అమలు
జీవో నంబరు`53 జారీ
రవాణా చార్జీల కింద కిలో మీటరుకు రూ.1.20
వసతి, భోజన ఫీజులపైనా నియంత్రణ
మూడేళ్ల కాలపరిమితితో జీవో

అమరావతి : రాష్ట్రంలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ట్యూషన్‌/వార్షిక ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీజేసిన ఉత్తర్వులు ఈసారైనా అమలవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్‌ పాఠశాల/కళాశాలల్లో చదివే విద్యార్థులకు నిర్దేశించిన వార్షిక ఫీజులలో 30శాతం తగ్గిస్తూ ప్రభుత్వం జీవో57 జారీ జేసినప్పటికీ అది అమలు కాలేదు. ఆ జీవో అమలుకు పాఠశాల, విద్యాశాఖ అధికారులు తగిన కృషి చేయలేకపో యారనే విమర్శలున్నాయి. కళాశాలల పరిధిలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఖాతరు చేయలేదు. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితితో తాజా ఫీజుల వివరాల పట్టికను జీవో నంబరు52 ద్వారా (తేదీ:2482021) వెల్లడిరచింది. దీనినైనా అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తారా? నీరు గారుస్తారా? అని తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. నూతన జీవో ఫీజుల పట్టిక ఆధారంగానే ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ యాజమాన్యం అమలు చేయాల్సి ఉంది. ఈ ఫీజుల విధానం 202122, 202223, 2023`24 వరకు కొనసాగేలా జీవోలో స్పష్టం చేశారు. ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ పరిధిలో ఫీజులను విభజించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య రెగ్యులేటరీ అండ్‌ మోనీటరింగ్‌ కమిషన్‌ (ఏపీ ఎస్‌ఈఆర్‌ఎంసీ) ప్రభుత్వానికి నివేదించింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తూ పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌, సీబీఎస్‌ఈ పాఠశాలల యాజమాన్యం నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ట్యూషన్‌/వార్షిక ఫీజును రూ.10 వేలు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.12వేలుగా నిర్ధారించారు. మున్సిపాల్టీల పరిధిలోని నర్సరీ నుంచి 5 తరగ తులకు వార్షిక ఫీజు రూ.11వేలు, 6 నుంచి 10 తరగతులకు రూ.15వేలుగా నిర్ణయించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు వార్షిక ఫీజు రూ.12 వేలు, 6 నుంచి 10 తరగతులు చదివే విద్యార్థులకు రూ.18 వేలు ఖరారు చేశారు. ఈ ఫీజులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు (సీబీఎస్‌ఈ) గుర్తింపు పొంది నడుస్తున్న అన్ని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ యాజమాన్యానికి వర్తిస్తుంది. ఈ ఫీజులతోనే ప్రవేశ పత్రం వివరాలు, దరఖాస్తు, పరీక్షలు, విద్యార్థి నమోదు

ఫీజులు ఉంటాయి. రవాణా చార్జీల కింద ఆయా పాఠశాలలు నడిపే బస్సుల ద్వారా కిలో మీటరుకు 1.20 పైసలు చొప్పున తీసుకోవాల్సి ఉంది. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ ఫీజులను పంచాయతీ పరిధిలో ఏడాదికి రూ.18వేలు, మున్సిపాల్టీ పరిధిలో రూ.20వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.24వేలుగా తీసుకోవాలి. ఆయా పాఠశాలల్లో ఫీజులు, విద్యార్థుల వివరాలను సమగ్రంగా పుస్తకాలలో నమోదు చేయాల్సి ఉంది. నిర్దేశిత ఫీజులు మినహా ఆయా ప్రైవేట్‌ యాజమాన్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని తెలిపింది. ఇదే తరహాగా ప్రైవేట్‌, అన్‌`ఎయిడెడ్‌లో ఇంటర్మీడియట్‌ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసిన విషయం విదితమే.
జగన్‌కు ధన్యవాదాలు : ఏపీ నిరుద్యోగ జేఏసీ
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల విజ్ఞప్తుల మేరకు ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సంబంధించి ఇంటర్‌, పాఠశాల విద్య ఫీజుల వివరాలు ప్రకటించిన సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంతకుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన చాలా వర్గాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాట్లో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ప్రకటించిందన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలలో(పాఠశాల, కళాశాలలు) ఫీజులు తగ్గించాలంటూ తాము చాలాకాలంగా ఉద్యమాలు చేస్తున్నామని గుర్తుచేశారు. గతంలో ప్రభుత్వం రాయితీ ప్రకటించినా…చాలా ప్రైవేట్‌ విద్యాసంస్థలు అమలు చేయలేదని గుర్తుచేశారు. ఆ సమయంలో తాము ఏపీ ఎస్‌ఈఆర్‌ఎంసీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img