Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉన్నత విద్యా శాఖలో ఖాళీలు భర్తీ చేయండి

జగన్‌ ఆదేశం
ఉన్నత విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఆదేశాలిచ్చామని, జూన్‌ నాటికి వీటి నియామక ప్రక్రియ ప్రారంభం కావాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఖాళీలను భర్తీ చేయడంలో అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులన్నింటినీ తొలగించుకోని జూన్‌ నాటికి నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు చేపడుతు న్నామని, ఈ నేపథ్యంలో సిబ్బంది నియామాకం కూడా త్వరగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలన్నా రు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలని, విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. జాబ్‌ ఓరియెం-టె-డ్‌ కరిక్యులమ్‌ ఉండా లని, సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరిక్యులమ్‌లో భాగం కావాలని, ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలని, స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం -టైఅప్‌ చేసుకోవాలని,రిస్క్‌ ఎనాలసిస్‌, బ్యాంకింగ్‌, రిస్క్‌ మేనేజిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలని అన్నారు. వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img