Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఏపీలో ఒక్కరోజే 10 ఒమిక్రాన్‌ కేసులు

ఒమిక్రాన్‌ చాపకిందనీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒకేరోజు రాష్ట్రంలో 10 కొత్త ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచింది. దీంతో ఇప్పటిదాకా ఈ కరోనా వేరియెంట్‌ బారినపడ్డ వారి సంఖ్య 16కి చేరింది.బాధితులందరూ ఐసోలేషన్లో ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఏపీ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిరచారు. తూర్పుగోదావరిలో ముగ్గురు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు లో ఒక్కొక్కరు వేరియెంట్‌ బారినపడ్డారు. ఇక అనంతపురం, కర్నూల్‌ జిల్లాల్లో ఇద్దరి చొప్పున ఒమిక్రాన్‌ బారినపడ్డారు.
గడిచిన 24 గంటల్లో 186 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా బారి నుంచి 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1049 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img