Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఐదేళ్లలో 2.76 లక్షల అల్లర్ల కేసులు : కేంద్రం

న్యూదిల్లీ : 2016 నుంచి 2020 మధ్య ఐదేళ్లలో కాలంలో దేశ వ్యాప్తంగా 2.76 లక్షల అల్లర్ల కేసులు నమోదుకాగా అందులో 3,400 మతపరమైన అల్లర్ల కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం లిఖితపూర్వకసమాధానంగా లోక్‌సభకు అందించింది. అల్లర్ల కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ మేరకు లిఖిత పూర్వకసమాధానం ఇచ్చారు. దేశంలో ఐదేళ్ల కాలంలో 2.76 లక్షల అల్లర్ల కేసులు నమోదు కాగా అందులో 3,400 కేసులు మతపరమైన అంశాల ఆధారంగా చోటు చేసుకున్నవేనని తెలిపారు. 2020లో 857, 2019లో 438, 2018లో 512, 2017లో 723, 2016లో 869 కేసులు నమోదైనట్టు వివరించారు. నేషనల్‌ క్రైం బ్యూరో రిపోర్టు ఆధారంగా అందుతోన్న సమాచారం ఆధారంగా ఈ వివరాలను వెల్లడిరచినట్టు పేర్కొన్నారు. ఇక మొత్తం నమోదైన అల్లర్ల కేసుల్లో 2020లో 51,606, 2019లో 45,985, 2018లో 57,828, 2017లో 58,880, 2016లో 61,974 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
1,205 మంది భద్రతా సిబ్బంది ఆత్మహత్య
దేశ వ్యాప్తంగా వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ సిబ్బందిలో గత పదేళ్ల కాలంలో 1,205 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎదురైన మరో ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021లో అత్యధికంగా 156 మంది సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు. 2020లో 143 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోగా 2019లో 129 మంది, 2018లో 96, 2017లో 125, 2016లో 92 , 2015లో 108, 2014లో 125, 2013లో 113, 2012లో 118 మంది మృతి చెందినట్టు తెలిపారు. వీరిలో చాలా మందికి ఆర్థిక సమస్యలు, గృహ సమస్యలు, ఆరోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img