Monday, May 6, 2024
Monday, May 6, 2024

ధాన్యం సేకరణపై రాజకీయమా?

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై రాహుల్‌ ఆగ్రహం
న్యూదిల్లీ: తెలంగాణ రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులకు ఆయన మద్దతు తెలిపారు. ధాన్యం సేకరణను కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని మంగళవారం విమర్శించారు. రైతులను వేధించడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని సేకరించే నైతిక బాధ్యత నుంచి బీజేపీ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ తెలుగులో ట్వీట్‌ చేశారు. రైతులను ఆదుకునే విషయంలో రాజకీయం మంచిది కాదని హితవు పలికారు. రైతు వ్యతిరేక కార్యకలాపాల ద్వారా అన్నదాతను వేధించవద్దని, తెలంగాణలో పండిరచే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని రాహుల్‌ విన్నవించారు. తెలంగాణలో పండే ప్రతి గింజను ప్రభుత్వాలు సేకరించేంత వరకూ రైతుల తరపున కాంగ్రెస్‌పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img