Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోవిడ్‌ తీవ్రత తగ్గినా ముప్పు తొలగిపోలేదు

వాక్సినేషన్లే రక్ష : స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి

న్యూదిల్లీ : దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపివేస్తోందని, వ్యాధి తీవ్రత తగ్గిందేగానీ దాని ముప్పు తొలగలేదని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ అన్నారు. వాక్సిన్‌లతోనే కోవిడ్‌ నుంచి రక్షణ కవచమన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చిందని చెప్పారు. మహమ్మారి వేళ గతేడాది తరహాలో ఈ ఏడాది కూడా స్వాతంత్య్ర వేడుకల స్థాయి తగ్గిందన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. కోవిడ్‌ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అని సూచనలు చేశారు. కనిపించని శత్రువుతో సైన్స్‌ పోరు కొనసాగుతోందని కోవింద్‌ అన్నారు. యుద్ధప్రాతిపదికన అధికారిక చర్యలు కొనసాగినందునే ప్రజలకు కాస్త ఊరట లభించిందని చెప్పారు. వైద్యులు, నర్సులు, హెల్త్‌వర్కర్లు, అడ్మినిస్ట్రేటర్లు అంతా కరోనా యోధులని, తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని కొనియాడారు. రెండవ దశ విజృంభించినప్పుడు ప్రజారోగ్య సంరక్షణ మౌలిక వసతులపై ఒత్తిడి పెరిగిందని, వాస్తవానికి అత్యాధునిక ఆర్థిక వ్యవస్థలు కూడా వైరస్‌ ధాటికి విలవిల్లాడాయని రాష్ట్రపతి అన్నారు. ఆపద్కాలంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌ నుంచి రక్షణ కేవలం వాక్సిన్‌లతోనే సాధ్యమని అన్నారు. ఇప్పటికే దేశంలో 50కోట్ల మంది వాక్సినేషన్‌ పూర్తి అయిందని చెప్పారు. కోవిడ్‌ మృతులకు నివాళులర్పించారు. అదే సమయంలో వ్యవసాయ మార్కెటింగ్‌లో తెచ్చిన సంస్కరణలతో రైతులకు మరింత సాధికారత చేకూరిందని, వ్యవసాయోత్పత్తులకు రైతులకు మెరుగైన ధర లభిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలతోనే భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. వారి త్యాగాలను స్మరించాలని, నైపుణ్యాలను కలిగిన చిన్నారులను, కుమార్తెలను గుర్తించి వారు ఉన్నతస్ధానాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు రాష్ట్రపతి కోవింద్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img