Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురిసిన కుండపోత వర్షాలు, వరదలు సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా బయటపడలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లోని వందలాది గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, యానాంలో సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీలోని ఈ జిల్లాల్లో..మోస్తరు నుంచి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో సోమవారం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సోమవారం తేలికపాటి జల్లులు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం గణనీయంగా తక్కువగా ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో చిరు జల్లులు పడతాయి. చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
తెలంగాణలోని 9 జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో వాతావరణ హెచ్చరికలను సోమవారం జారీ చేసింది. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సోమవారం ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img